Naga Vamsi: సినిమా ఆడితేనే మీరుంటారు... జర్నలిస్టులకు నిర్మాత వార్నింగ్ 4 d ago

రీసెంట్‌గా రిలీజైన మ్యాడ్ స్క్వేర్ నెగిటివ్ రివ్యూలపై చిత్ర నిర్మాత నాగవంశీ ఫైర్ అయ్యారు. సినిమా బాగుందని ప్రేక్షకులు చెప్తుంటే.. కంటెంట్ లేదని రివ్వ్యూలు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అభిమానులకు తెలిసినంత కూడా సినీ విశ్లేషకులకు తెలియదా అని ప్రశ్నించారు. ముఖ్యంగా సినిమా ఆడితేనే మీరుంటారు.. లేకుంటే ఇంటికెళ్లాల్సిందే అంటూ సినీ జర్నలిస్టులకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సినిమా టికెట్ ధరలు తగ్గించినా నెగిటివ్ రివ్యూలను హైలెట్ చేస్తూ.. మీడియాలో చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు.